Wednesday, 30 December 2015

గ్రూప్‌-2 నోటిఫికేషన్ విడుదల

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. సబ్‌ రిజిస్ట్రార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఏసీటీవో, ఆబ్కారీ శాఖ ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.


నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొలువుల మేళా మొదలైంది. 439 గ్రూప్‌-2 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 ఉద్యోగాలకు ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు.  రేపటి నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు.


Tuesday, 29 December 2015

4 స్థానాల్లో తెరాస, 2 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం.

  • స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస హవా కొనసాగుతోంది. 
  • నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ పట్టు నిరూపించుకుంది.


నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే విజయం సాధించారు.మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌రెడ్డి చెరో స్థానం కైవసం చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి , శంభీపూర్‌ రాజు లు గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

Monday, 28 December 2015

టీ హబ్‌తో కలిసి పని చేస్తాం - సత్య నాదెళ్ల


ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆరంభించిన ‘అంకుర కేంద్రం’- టీహబ్‌తో కలసి పనిచేస్తామని ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్ల వెల్లడించారు. ‘‘టీ హబ్‌తో కలిసి పని చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మీ స్వప్నాలను సాకారం చేయడానికే టీ హబ్‌లో భాగస్వాములం అవుతున్నాం. టీ హబ్‌తో కలిసి పని చేస్తాం’’ అని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో స్టార్ట్‌పలకు చేయూతనిచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సొంత నగరం హైదరాబాద్‌కు నాలుగు రోజుల ప్రైవేట్‌ పర్యటనపై వచ్చిన సత్య నాదెళ్ల సోమవారం గచ్చిబౌలి త్రిబుల్‌ ఐటీ క్యాంప్‌సలో తెలంగాణ ప్రభుత్వం పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేసిన అతి పెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ టీ -హబ్‌ను సందర్శించారు. ఐటీ మంత్రి కేటీఆర్‌ స్వయంగా స్వాగతం పలికి సత్య నాదెళ్లను టీ హబ్‌ భవనంలోకి తీసుకెళ్లారు. టీ హబ్‌లోని వసతులను దగ్గరుండి చూపించారు. తన సొంత నగరంలో ఔత్సాహికుల కోసం ఏర్పాటు చేసిన టీ హబ్‌ అద్భుతమైన క్షేత్రమని సత్య అన్నారు. స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ బలపడేందుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
"వైఫల్యాన్ని ఎదుర్కోవడం కాదు. వైఫల్యం నుంచి ఏం నేర్చుకున్నావనేది ముఖ్యం. నా విజయగాథలన్నీ నా వైఫల్యాల నుంచి నేర్చుకున్న గుణపాఠాలే".

మీ ఔత్సాహిక కలల నుంచి స్ఫూర్తి పొందాలనే ఇక్కడికి వచ్చాను. మీ మెదడులో మొలచిన ఆలోచనాకుంరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుగారనివ్వకండి. ఆ ఆలోచనకు నీరుపోస్తూ ఆచరణలో ముందుకు సాగే సత్తాను సాధించుకోండి. అది నిరంతరం కొనసాగే సంస్కృతిని అలవర్చుకోండి. అలాంటి పని సంస్కృతిలో ఎంతగా జీవిస్తే మీ వ్యాపారం అంత సుస్థిరంగా ఎదుగుతుంది. అంకుర రంగంలో భారతీయుల ప్రతిభ అనూహ్యంగా వెలుగుతోంది. భారతీయులు ఈ రంగాన్ని శాసించబోతున్నారు’’ అని సత్య నాదెళ్ల ప్రోత్సహించారు. అందరికీ అంతర్జాల సౌకర్యం కల్పించడానికి మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఆలోచిస్తున్న ‘వైట్‌స్పేస్‌ టెక్నాలజీ’ గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రతి ఒక్కరికీ అంతర్జాల సదుపాయం అందుబాటులో రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ.. ఇందుకోసం స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మైక్రోసాఫ్ట్‌ ప్రోత్సహిస్తుందన్నారు.
"మేం చదువుకునేటప్పుడు ఇక్కడ టీ-హబ్‌ల్లాంటివి లేవు. అప్పట్లో టి-అంటే ట్యాంక్‌బండేనని చమత్కరించారు".

   తరగతి గదుల డిజిటైజేషన్‌, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ వంటి పలు రంగాల్లో మైక్రోసాఫ్ట్‌ సహకారాన్ని కోరినట్టు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సత్య నాదెళ్ల కూడా ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ కీలక భూమిక పోషిస్తున్న ‘వైట్‌ స్పేస్‌ టెక్నాలజీ’లో కలిసి పని చేయాలని భావిస్తున్నామన్నారు. తాము చివరి మైలురాయి వరకు కనెక్టివిటీని అందించాలని కోరుకుంటున్నామని, కానీ... సత్య మాత్రం ఈ టెక్నాలజీలో స్థానిక ఔత్సాహికులు ముందుకు రావాలని, మైక్రోసాఫ్ట్‌ సంస్థతో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారని వివరించారు. సుస్థిర వ్యాపారాభివృద్ధికి క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై పని చేయాలనుకుంటున్నామని మంత్రి చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన, మేలైన విద్యను అందించాలని ప్రభుత్వం కోరుకుంటోందని, అందుకే రాష్ట్రంలోని వేలాది పాఠశాలలను డిజిటలైజ్‌ చేయాలని కోరుతున్నామని కేటీఆర్‌ వివరించారు. కార్యక్రమంలో ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కా, హ్యూలెట్‌ ప్యాకార్డ్‌ అనుబంధ కంపెనీ అరుబా నెట్‌వర్క్స్‌ సీటీవో కీర్తి మెల్కొటే, నాస్కామ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ సీఈవో జీవీ ప్రసాద్‌, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన, టీ-హబ్‌ సీఈవో జయ్‌కృష్ణన, సీఓఓ శ్రీనివాస్‌ కొల్లిపర తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ దంపతులు..

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో అయుత చండీ మహాయాగాన్ని ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన కేసీఆర్, వేద పండితుల సూచన మేరకు ఇవాళ రాజన్నను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అయుత మహాచండీయాగం అనంతరం వేములవాడకు బయల్దేరి వెళ్లిన కేసీఆర్‌ దంపతులు రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి ఈటల రాజేందర్‌ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

Saturday, 26 December 2015

అయుత చండీయాగంలో ఈరోజు...




    అయుత చండీయాగం ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరింది.  ఉదయం గురుప్రార్థన, గణపతిపూజతో ప్రారంభమవుతుంది.ఇవాళ కుండసంస్కారం, ప్రధానకుండంలో అగ్నిప్రతిష్ఠ నిర్వహిస్తారు. అలాగే అగ్ని విహారణం, స్థాపిత దేవతాహవనం, సపరివార అయుత చండీయాగం నిర్వహిస్తారు. అలాగే చండీయాగంలో పాల్గొన్నరుత్విక్కులకు సన్మానం జరగనుంది. అలాగే పూర్ణాహుతితో అయుత చండీయాగం ముగియనుంది. కాగా... నేడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తదితరులు చండీయాగానికి విచ్చేయనున్నారు. ఐతే ఎర్రవల్లికి తెల్లవారుజాము నుంచే  భక్తులు  బారిగా తరిలీ వస్తున్నారు. అయుత చండీయాగం ఈ రోజుతో ముగియనుంది.Watch

నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం..

 ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా... మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 6 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో మిగిలిన 6 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

Friday, 25 December 2015

గాలిపటం ఎగీరేస్తున్న భిత్తిరి సత్తి

పిల్లలతొ కలిసి సరదాగా గాలిపటం ఎగీరేస్తున్న సత్తి ని జాగ్రత చేస్తు,
చైనా మాంజ వాడొద్దు పక్షులకు ప్రమాదం, అట్లనే బంగ్ల పైన  ఎక్కి గాలిపటం ఏగీరేయద్దు అని చెప్పి ఆపిన సావిత్రక్క.






Thursday, 24 December 2015

కోదండరాం సలహా పాటిస్తాం





  • గత ప్రభుత్వాల విధానాలవల్లే రైతు ఆత్మహత్యలు,
  • మానవ హక్కుల అంశంగా పరిగణిస్తున్నాం,
  • కనీస మద్ధతు ధర మా చేతుల్లో లేదు,
  • రోజుకు 7 గంటలు విద్యుత్‌ ఇస్తున్నాం, 
  • హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం.

Wednesday, 23 December 2015

Tuesday, 22 December 2015

Ayutha Chandi Yagam | LIVE

 ఐదు రోజులు! 106 హోమగుండాలు! 1500 మంది రుత్విక్కులు! పది వేల చండీ సప్తశతి పారాయణలు! కోటి నవార్ణ మంత్ర జపం! వెరసి అయుత చండీ మహా యాగం! భారతదేశంలోనే గత రెండు శతాబ్దాల్లో రెండోసారి నిర్వహిస్తున్న అత్యద్భుత ఆధ్యాత్మిక క్రతువు! హోమాల్లో.. మరీ ముఖ్యంగా శాక్తేయ హోమాల్లో కూడా అతి శక్తిమంతమైన హోమం!


Saturday, 29 November 2014

PRESS RELEASE DATE: 29-11-2014

         Government of China’s Sichuan province has extended an invitation to Honorable Chief Minister Sri.K.Chandrashekar Rao and his accompanying delegation from the Telangana state to visit Chengdu, Sichuan province, to strengthen friendly relations between Telangana state and Sichuan province, in view of promoting business and cultural cooperation between these two.
In a letter to the Chief Minister’s Office Ms.Zhang Tao, Deputy Director General of Sichuan Foreign affairs Office mentioned that both Sichuan province and Telangana State are very similar in their history, culture and resources.
She said that, stories told of dynasties and kings who ruled these lands, where tales were inscribed in history so deep that, they have now become legends or even myths.
The letter described that, both Sichuan province and Telangana have carvings and sculptures of Lord Buddha and his teachings are practiced and preached very devoutly.
The Deputy Director General also mentioned that Telangana economically is driven by agriculture and both Sichuan and Telangana are among the richest in mineral resources and both are heavy industry centers of their respective countries.
Ms.Zhang Tao, informed through the letter that Chengdu the capital of Sichuan is also the headquarters of Donfang Electric Corporation Ltd., the Worlds largest power equipment manufacturer. Considering the fact that Telangana state is in need of large capacity of power projects at the earliest, cooperation between related parties in this subject should be discussed and an MOU should be signed as and when the visit of the Chief Minister materializes mentioned in the letter.

Friday, 16 May 2014